has gloss | tel: అల్లాహ్ (అరబ్బీ : الله) అరబ్బీ భాష పదమైన అల్-ఇలాహ్ నుండి ఉద్భవించిన పదం అల్లాహ్. ఇలాహ్ అంటే దేవుడు అని అర్ధం. అరబ్బీ భాష మాట్లాడె క్రైస్తవులు, యూదుల కూడా దేవున్ని అల్లాహ్ అనుదురు. అల్ ఇలాహ్ అంటే ఆ దేవుడు , అందరికీ తెలిసిన దేవుడు .అద్వితీయుడు అంటే అలాంటి వాడింకెవడూ లేడు, ఉండడు. ఇది అరబీ భాషాపదం. హెబ్రూ భాష లోని "ఎలోహిం" ,"హల్లెలూయా" , అరమాయిక్ భాషలోని "ఎలాహా " లాంటి పదాలు "ఇలాహ" నుగుర్తుచేస్తాయి.తెలుగులో "ఏకైక ఆరాధ్యుడు" అని అర్థం. మొత్తం ప్రపంచ మానవాళి మార్గదర్శకత్వం కోసం పంపబడిన అంతిమ దివ్యగ్రంథమైన ఖుర్ఆన్ లో ఆ అల్లాహ్ ఎవరు అంటే ఆ ఏకైక ఆరాధ్యుడు ఎవరు అనే ప్రశ్నకు అనేక చోట్ల సమాధానం ఇవ్వబడినది. వాటి ఆధారంగా మరియు ప్రపంచ ప్రజలందరి మార్గదర్శకత్వం కోసం పంపబడిన అంతిమ దైవసందేశహరుడు మరియు ప్రవక్త అయిన మహనీయ ముహమ్మద్ (అల్లాహ్ ఆయనపై శాంతిని కరుణించుగాక) బోధించిన పవిత్ర ప్రవచనాల ఆధారంగానే క్రింద తెలిపిన అల్లాహ్ యొక్క 99 విశేష గుణగణాలు ఉనికిలోనికి వచ్చినవి. |