| has gloss | tel: కునికినపాడు, కృష్ణా జిల్లా, కంచికచెర్ల మండలానికి చెందిన గ్రామము. కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ కుగ్రామము నుండి ఆవలి ఒడ్దున బౌద్ధ చారిత్రక స్థలంతో పాటు హిందూ శైవ తీర్థ స్థలం అయిన అమరావతి కనబడును. కృష్ణా జిల్లా ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులైన సాధు రామకృష్ణయ్య సోదరుడు సాధు నాగభూషణం ఈ ఊరి చరిత్రలో ప్రముఖులు. ఈయన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మున్నలూరు సంగమేశ్వర పంపింగ్ స్కీమ్ ను అవిరళ కృషితో, Dr. K.L.Rao సహకారంతో ఏర్పరిచారు. ఇది ఈ ప్రాంతపు మొదటి పథం(1952). ఈ గ్రామమునందు తెలుగు సినిమా రంగములో ఆణిముత్యము అని కొనియాడబడే చిత్రము, కళాతపస్వి దర్శకుడు కె.విశ్వనాధ్ యొక్క చిత్రము అయిన సప్తపది అధిక భాగము చిత్రించ బడినది. |