has gloss | tel: తిమ్మాపూర్ రంగారెడ్డి జిల్లా, కందుకూర్ మండలానికి చెందిన గ్రామము. భౌగోళికంగా ఈ గ్రామము కందుకూరు మండలములొ ఈశాన్య వైపున ఇబ్రహీంపట్నం మండలానికి సమీపంలో ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి స్వగ్రామం. గ్రామ సరిహద్దులు తిమ్మాపూర్ గ్రామానికి తూర్పున మాదాపుర్, దక్షిణమున రాచులూరు, పశ్చిమాన రాచులూరు మరియు లేమూరు గ్రామాలు, ఉత్తరాన మాదాపూర్ మరియు ఇబ్రహీంపట్నం మండలము సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు తిమ్మాపూర్ గ్రామము మండల కేంద్రమైన కందుకూరు నుంచి మాదాపూర్ వెళ్ళు మార్గంలో ఉన్నది. హైదరాబాదు-కల్వకుర్తి ప్రధానమార్గంపై గూడూరు వద్ద కుడివైపున మళ్ళి రాచలూరు వద్ద ఎడమవైపున మళ్ళి ఈ గ్రామానికి చేరుకోవచ్చు. ఈ గ్రామానికి రైలు సదుపాయము లేదు. |